TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్.. ప్రపంచ బ్యాంకు బృందం

Published on: Thu Apr 9, 2026 8:46AM

అమరావతిలో భారీగా పెట్టుబడులకు అవకాశముందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అన్నారు.  రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని అభిప్రాయపడ్డారు.   అమరావతి సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచబ్యాంకు ప్రతినిథులకు తెలిపారు.  ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం (ఏప్రిల్ 8) రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆ బృందం అమరావతి నిర్మాణ ప్రగతిని  ప్రశంసించింది.

అమరావతిలో ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ-విద్యుత్ రంగ సంస్కరణల వల్ల  భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని పేర్కొంది.  మౌలిక సదుపాయాల అభివృద్ధితో వాణిజ్య కార్యాకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నట్టు బృంద ప్రతినిధులు ముఖ్యమంత్రితో చెప్పారు.

ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టడంతోపాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా తాము పని చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంక్ బృందానికి సీఎం చంద్రబాబు వివరించారు. మూడు రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.