TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రత్తిపాటి.. అంశాలు..

Published on: Wed Mar 15, 2017 12:59PM

 

ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి యనమల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 2017-18 గాను వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరాతిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తమది ఇది రైతు రక్షణ ప్రభుత్వం అని.. రైతుల కోసం తొలిసారిగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం తమదని గుర్తు చేశారు. దేశంలో తొలిసారిగా బయోమెట్రిక్ ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. వ్యవసాయ దారుల ప్రయోజనాలు కాపాడేందుకు కొత్త విత్తన చట్టం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఇంకా వ్యవసాయ బడ్జెట్ లోని అంశాలు..


* వ్యవసాయ రంగానికి రూ. 9,090 కోట్లు
* సమగ్ర సాగునీటి, వ్యవసాయ రూపాంతీకరణకు రూ. 1600 కోట్లు
* పండ్ల తోటల పెంపకానికి రూ. 1015 కోట్లు
* ఆయిల్ ఫామ్ విస్తరణకు రూ. 55 కోట్లు
* సూక్ష్మ సేద్యానికి రూ. 200 కోట్లు