TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ బడ్జెట్.. నిరుద్యోగులకు శుభవార్త...

Published on: Wed Mar 15, 2017 12:01PM

 

ఏపీ అసెంబ్లీలో తొలిసారి అర్థిక మంత్రి యనమల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  2017-18 సంవత్సరానికి గాను ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుద్యోగులకు కాస్త ఉరట కలిగించే విధంగానే ఉంది. నిరుద్యోగ భృతి కోసం ఈ బ‌డ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు యనమల తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సర్కారు 10వేల ఉద్యోగాలను భర్తీ చేయనుందని.. ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక‌, యువత నైపుణ్యాభివృద్ధి కోసం రూ.398 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.