వాళ్లే నాపై కేసు పెట్టారు.. నువ్వు పాదాభివందనం చేయలేదా..?
Published on: Tue Mar 21, 2017 12:05PM
.jpg)
ఏపీ అసెంబ్లీలో.. ఆతరువాత మీడియా పాయింట్ వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ ఆస్తులపై కూడా అసెంబ్లీ రచ్చ జరుగుతుంది. ఏపీ అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తరువాతే నాపై అక్రమాస్తుల కేసు పెట్టారని.. ఎర్రన్నాయుడు, చంద్రబాబు కలిసి నాపై కేసు పెట్టారని అన్నారు. ఈ సందర్బంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 43 వేల కోట్ల ఆస్తి ఈడీ జప్తు చేసింది..ఐదేళ్లలో ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలి.. మీ నాన్న హయాంలో అధికారులు జైలుకు ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు. అంతేకాదు సోనియాకు పాదాభివందనం చేయడంవల్లే బెయిల్ వచ్చింది.. అది నిజమో.. కాదో జగనే చెప్పాలి అని అన్నారు. దీనికి గాను స్పందించిన జగన్.. రూ.43 వేల కోట్ల ఆస్తి జప్తు చేసింది అంటున్నారు. ఆ 43 వేల కోట్లలో పదిశాతం ఇస్తే ఎక్కడైనా సంతకం పెడతా అని అన్నారు.


