TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మీడియా పాయింట్ వద్ద వైసీపీ, టీడీపీ మహిళల వాగ్వాదం...

Published on: Tue Mar 21, 2017 10:59AM

 

ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. మీడియా పాయింట్ వద్ద వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. మీడియాతో మాట్లాడేందుకు వైకాపా, తెదేపా సభ్యులు మైకులు లాక్కునేందుకు పోటీపడ్డారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి మాట్లాడేందుకు పోటీ పడి.. మీడియా లోగోలు లాక్కొని మరీ ఎవరికి వారే మాట్లాడారు. దీంతో వైసీపీ, టీడీపీ మహిళా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో అక్కడకు వచ్చిన మంత్రి పీతల సుజాత మైక్‌ ఇవ్వాల్సిందిగా కోరినా ఆమె పట్టించుకోలేదు. తెదేపా సభ్యులు మైకులు తమ వైపునకు లాక్కునేందుకు ప్రయత్నించడంతో వైకాపా సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో మార్షల్స్‌ అక్కడకు చేరుకుని వారిని వారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభతో పాటు బయటా మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇంకా పీతల సుజాత మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న మాపరిస్థితే ఇలా ఉంటే.. ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది.