అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం...వైసీపీ వాకౌట్
Published on: Tue Mar 7, 2017 9:04AM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు పూర్తికాకముందే ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ వాకౌట్ చేసింది. ఎస్సీ, ఎస్టీ ల విద్యుత్ బిల్లు అమలుపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.... ఏస్సీ, ఎస్టీలకు ఏదో ముస్టి వేసినట్టు విద్యుత్ బిల్లు అమలు చేశారని వ్యాఖ్యానించడంతో... ఈ వ్యాఖ్యలను అధికార పక్ష నేతలు వ్యతిరేకించారు. జగన్ ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.


