తొలిసారి అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు...
Published on: Mon Mar 6, 2017 10:23AM

అమరావతిలో తొలిసారి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనంలో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం మొదలుపెట్టారు. అసెంబ్లీ సమావేశాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇంకాఅన్ని పార్టీల సభ్యులు శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. కాగా ఈ సమావేశాలు ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది. అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర విభజనతో ఏర్పడ్డ సంక్షోభాన్ని సవాల్ గా తీసుకున్నాం...రెండేళ్లుగా అభివృధ్ధిలో ముందుకెళ్తున్నామని అన్నారు. 2022 నాటికి ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం అని అన్నారు.


