TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫోర్బ్స్ జాబితాలో అమరరాజా బ్యాటరీస్.. బెస్ట్ ఎంప్లాయిర్ గా సత్తా చాటిన కంపెనీ

Published on: Wed Jul 6, 2022 1:01PM

అమరరాజా బ్యాటరీస్ కంపెనీ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన బెస్ట్ ఎంప్లాయిర్స్ జాబితాలో ఫోర్బ్స్ కంపెనీకి చోటు లభించింది. అమరరాజా బ్యాటరీస్  గుంటూరు ఎంపీ, తెలుగుదేశం నాయకుడు గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన కంపెనీ అన్న సంగతి విదితమే. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 500 బెస్ట్ ఎంప్లాయిర్స్ జాబితాలో తమ సంస్థ నిలిచిన విషయాన్ని అమరరాజా గ్రూప్ వెల్లడించింది.

ఈ మేరకు మంగళవారం చేసిన ట్వీట్ లో తమ సంస్థకు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ బెస్ట్ ఎంప్లాయర్ జాబితాలో స్థానం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ప్రజల విశ్వాసం, నమ్మకం చూరగొన్నందు వల్లే తమ సంస్థకీ గుర్తింపు వచ్చిందని పేర్కొంది.

ఫోర్బ్స్ సంస్థ జాబితాలో స్థానం పొందడం తమ సంస్థకు దక్కిన గౌరవంగా అభివర్ణించిన అమరరాజా గ్రూప్ ఈ స్ఫూర్తితో మరింత ఉత్తమంగా ముందుకు సాగుతామని ట్వీట్ లో పేర్కొంది. త్వరలో లడఖ్ లో దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ ను నెలకొల్పబోతున్నట్లు అమరరాజా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఆ ట్వీట్లో తెలపారు.