TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెజ్లింగ్ లో అమన్ కు కాంస్య పతకం

Published on: Sat Aug 10, 2024 10:30AM

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. రెజ్లింగ్ లో భారత రెజ్లర్ అమన్ షెరావత్ కాంస్యం సాధించారు. మొత్తంగా పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు ఇది ఆరో పతకం. పురుషుల రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో శుక్రవారం జరిగిన పోరులో అమన్ షెరావత్ ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్ టోయ్ ను ఓడించి కాంస్య పతకం సాధించాడు. 

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించాడు. భారత్‌కు ఇది ఆరో పతకం. కాంస్య పతకం కోసం నిన్న 57 కిలోల విభాగంలో జరిగిన పోరులో 13-5తో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్ టోయ్‌ను ఓడించి పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు.  అంతకు ముందు గురువారం జరిగిన సెమీస్ పోరులో  జపాన్ రెజ్లర్ రీ హిగుచి చేతిలో పరాజయం పాలైన ఆమన్.. కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో ఎలాంటి పొరపాటుకూ తావివ్వకుండా 13-5 తేడాతో విజయం సాధించాడు.