TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విగ్రహాల ధ్వంసం:13మందిపై కేసులు, ముగ్గురి అరెస్ట్

Published on: Sat Jan 28, 2012 10:24AM

అమలాపురం : అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు.13మందిపై కేసులు నమోదు చేసినట్లు ఐజీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.ఈ కేసుకు సంబంధించి అరెస్ట చేసిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ తాగిన మైకంలోనే నిందితులు విగ్రహాలను ధ్వంసం చేశారని తెలిపారు. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులు ఇరవయ్యేళ్ల లోపువారేనని, పరారీలో ఉన్న మిగతావారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

విగ్రహాల విధ్వంసానికి కారకుడిగా పోలీసులు చెప్తున్న గంధం పల్లంరాజు పరారీలో ఉన్నాడు.ధ్వంసం చేసిన తర్వాత వాటిని ఎక్కడెక్కడ పడవేసిందీ నిందితులు పోలీసులకు చూపించారు. స్థానిక వ్యవసాయ బావిలో పడేసిన విగ్రహాలను పోలీసులు బయటకు తీసి స్టేషన్కు తరలించారు. నాలుగురోజుల క్రితం అమలాపురం ప్రాంతంలో జరిగిన విగ్రహాల విధ్వంసం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన విషయం తెలిసిందే.కాగా, విగ్రహాల విధ్వంసానికి నిరసనగా మాల మాహానాడు శనివారం ఏలూరు బంద్‌కు పిలుపునిచ్చింది. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు.విద్యాసంస్థలు, దుకాణాలు మూత పడ్డాయి. ఆందోళనకారులు పలు చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు.