వారికి రాజకీయాలను అంటగట్టి అవమానించకూడదు
Published on: Wed Jan 25, 2012 8:42AM
న్యూఢిల్లీ :
అమలాపురం సంఘటన అత్యంత విచారకరమని కాంగ్రెస్ నేత, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ను అవమానించడం అన్యాయమన్నారు. దేశం కోసం త్యాగం చేసిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలే తప్ప వారికి రాజకీయాలను అంటగట్టి ఇటువంటి సంఘటనలకు పాల్పడడం తగదన్నారు. చిరంజీవిని చులకన చేసిన మాట్లాడడం బాలయ్యకు తగదని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం కోసమే చిరంజీవి కాంగ్రెస్లో చేరారని చెప్పారు. కమ్యూనిస్టులకు రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు లేవని ఆయన చెప్పారు.


