టాప్ లిస్ట్ లోకి అమలాపాల్
Published on: Sun Mar 17, 2013 12:57PM

“మైనా”గా.... వాలు కళ్లతో ప్రేక్షకులపై వల వేసిన అమలాపాల్ మెల్లి మెల్లిగా... టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి దూసుకుపోతోంది. అందంతో పాటూ... మాంచి టాలెంట్ కూడా ఉండటంతో... ఈ మలయాళీ ముద్దుగుమ్మకు ఆవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం అల్లుఅర్జున్, నానీ, తమిళంలో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉన్న అమలకు బెల్లంకొండ సురేశ్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట. డేట్స్ ఖాళీ లేవని అమల చెప్పినా... కోటి రూపాయిలు చెల్లించుకుని మరీ... అమ్మాయితో ఓకే చెప్పించుకున్నారట బెల్లంకొండ. దీన్ని బట్టే అర్ధమవుతుంది... అమలకు డిమాండ్ ఎంతగా పెరిగిందో....!


