Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్తమనటుడు అల్లు అర్జున్.. ఉత్తమ సినిమా కల్కి
posted on: May 29, 2025 11:01AM
.webp)
గద్దర్ అవార్డుల ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాల తరువాత సినీ పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాయుద్ధనౌక, దివంగత గద్దర్ పేరిట సినీ అవార్డులను అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అవార్డుల విజేతల జాబితాను తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అవార్డుల కమిటీ జ్యూరీ ఛైర్‌పర్సన్ సీనియర్ నటి జయసుధ ప్రకటించారు. 2024 సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రంగా కల్కి సినిమాకు అవార్డు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా పుష్ప2లో నటనకు గాను అల్లు అర్జున్, ఉత్తమ నటిగా 35 చిన్న కథ కాదు సినిమాకు నివేదా థామన్ ఎంపికయ్యారు. ఇక రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్. మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ కు పురస్కారాలు దక్కాయి. అలాగే ఉత్తమ దర్శకుడిగా కల్కి సినిమాకు గాను నాగ్ అశ్విన్ కు అవార్డు దక్కింది.
ఈ సారి ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకే కాకుండా జాతీయ సమైక్యతను చాటిచెప్పే చిత్రాలు, ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, తెలంగాణ వారసత్వం, పర్యావరణం, చరిత్ర వంటి అంశాలపై నిర్మించిన సినిమాలకు కూడా ప్రత్యేక పురస్కారాలు అందశారు. యానిమేషన్ సినిమాలు, తొలిసారి దర్శకత్వం వహించిన వారి చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, సామాజిక ప్రభావం చూపిన చిత్రాలు, లఘు చిత్రాల విభాగాల్లోనూ గద్దర్ అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు సినిమాపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాసిన వారికి, పుస్తకాలు ప్రచురించిన వారికి కూడా గద్దర్ పురస్కారాలు దక్కాయి. గతంలో ప్రకటించిన కాంతారావు, పైడి జయరాజ్, ఎం. ప్రభాకర్ రెడ్డి వంటి ప్రముఖుల పేర్లతో ఉన్న అవార్డులను కూడా కొనసాగించారు.


.webp)



