Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అల్లు అర్జున్ నంద్యాల పర్యటన రచ్చకు బాలయ్య ఫుల్ స్టాప్!?
posted on: Oct 29, 2024 5:15PM

నందమూరి బాల కృష్ణ తాను హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ద్వారా అల్లు అర్జున్ నంద్యాల పర్యటన రేపిన రచ్చకు ఫుల్ స్టాప్ పేట్టేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షో ద్వారా బాలకృష్ణ ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. ఇప్పుడు నాలుగో సీజన్ గత సీజన్లకు మించి అన్నట్లుగా సాగుతోంది. ప్రతి శుక్రవారం ఆహా లో ప్రసారమౌతున్న ఈ అన్ స్టాపబుల్ షో సీజన్ ఫోర్ తొలి ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ షో అంచనాలకు మించి విజయవంతమైంది.
ఇప్పుడు నాలుగో సీజన్ తరువాతి ఎపిసోడ్లకు గెస్ట్ లుగా ఎవరు వస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ షోలో పుష్ప 2 మూవీ ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్ పాల్గొననున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అంతకు ముంది అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షోలో అల్లు అర్జున్ సందడి చేయనున్నారు. ఇటీవలే అన్ స్టాపబుల్ ఫోలో అల్లు అర్జున్ తో ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కూడా జరిగింది.
దీంతో ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ కచ్చితంగా అల్లు అర్జున్ నంద్యాల పర్యటనపై ముప్పిరిగొన్న వివాదంపై ప్రశ్నలు సంధించడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న శిల్పా రవిచంద్రకిషోర్ కు ఓటు వేయాలని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. ఒక వైపు పవన్ కల్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా కూటమి తరఫున బరిలో ఉన్నారు. అటువంటి సమయంలో వైసీపీ అభ్యర్థిగా మద్దతుగా అల్లు అర్జున్ మాట్లాడటంతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య రిలేషన్స్ బాగా లేవా అన్న ప్రచారం కూడా జరిగింది. అది ఇప్పటికీ అలాగే ఉంది. బాలయ్య తన అన్ స్టాపబుల్ షో ద్వారా ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇటు అల్లు అర్జున్ కూడా తాను నంద్యాల ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, తన ఉద్దేశమేంటో అల్లు అర్జున్ క్లారిటీ చెప్పే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ ప్రసారం తరువాత అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అటు బన్నీ అభిమానులు, ఇటు మెగా అభిమానులూ కూడా భావిస్తున్నారు.



.webp)


