Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఒక పుష్ప నేషనల్, స్టేట్ అవార్డులు రెండు..కారణాలేంటి?
posted on: May 29, 2025 6:20PM

పుష్ప పార్ట్ వన్ ద్వారా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రాగా.. పార్ట్ టూ ద్వారా.. స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం మాములు విషయం కాదు. ఒక పాత్రను దర్శక రచయితలు మలచడం ఒక ఎత్తు అయితే దాన్ని చేయడం మరొక ఎత్తుగా భావించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ దర్శక రచయితలదా? లేక ఆ కేరెక్టర్ కి ప్రాణం పెట్టిన ఆర్టిస్టుదా? ఎవరి సమర్ధత ఎంతెంత? ఎవరికి ఈ ఘనతను ఇవ్వాల్సి ఉంటుందని చూస్తే.. ఒక రకంగా చెబితే ఆర్టిస్టుకే ఈ క్రెడిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది.కారణం.. పాత్రలు అన్నింటా ఉంటాయి. అందరకూ క్రియేట్ చేయగలరు. కానీ దాన్ని పాన్ ఇండియాలో ప్రేక్షక ప్రజలను అలరించడం.. ఒక రకమైన మేనరిజమ్స్ తో ఆకట్టుకోవడం.. ఇవన్నీ ఆర్టిస్టు చేతుల్లోనే ఉంటాయి.
పుష్ప 2 పాత్ర అయితే, ఏకంగా డైలాగ్ డెలివరీ కూడా సరిగా ఉండదు. నోట్లు తంబాకు పెట్టుకుని నత్తి నత్తిగా డైలాగ్ చెప్పడం అన్నది ఇందులో కనిపిస్తుంది. దీంతో .. ఈ పాత్రను మరింత కష్టతరం చేశారు దర్శక రచయితలు. దీంతో చెప్పేదేముందీ ఈ పాత్ర పోషణ మరింత కఠువుగా మారినా.. దాన్నికూడా ఒక ఛాలెంజింగా తీసుకున్న నటుడు అల్లు అర్జున్ దీన్ని భేష్ అనిపించాడు. ఇక్కడ మరో సబ్జెక్ట్ ఏంటంటే.. ఇలాంటి స్మగ్లర్ కేరెక్టర్స్ కి, గద్దర్ లాంటి ప్రజా వాగ్గేయకారుడు, విప్లవకారుడి పేరిట ఇవ్వడమేంటి? ఇక్కడసబ్జెక్ట్ గద్దర్ కీ ఆ పాత్రకీ ఉన్న పోలిక కాదు. అంతటి కష్టతరమైన పాత్రను ఒక నటుడిగా అతడెలా చేశాడు? అన్నదే కీలకం. దీంతో ఈ దృష్టికోణంలో మనం అలా చూడాల్సి ఉంటుందని చెప్పాలి



.webp)


