ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యుడి అరెస్ట్
Published on: Sat Sep 6, 2014 11:56AM

భారతదేశంలో అల్ ఖైదా శాఖను ప్రారంభించాలని ఆ సంస్థ నాయకుడు ప్రకటించిన నేపథ్యంలో భారతదేశంలో పోలీసు వ్యవస్థ ఎలర్ట్ అయింది. అల్ ఖైదా హెచ్చరికను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎక్కడో వున్న అమెరికా అంటున్నప్పటికీ భారత దేశం దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. భారతదేశంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. అంగుళం అంగుళాన్నీ డేగకళ్ళతో వెతుకుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ముజాహిద్దీన్ కీలక సభ్యుడు అజీజ్ షేక్ పోలీసులకు దొరికాడు. అజీజ్ షేక్‌ని ఢిల్లీ పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లోని సహ్రాస్ పూర్‌లో పట్టుకున్నారు.


