అల్లరోడికి చిక్కిన సునీల్ భామ
posted on: Nov 8, 2013 10:38AM

సునీల్ తో "పూలరంగడు", "మిస్టర్ పెళ్ళికొడుకు" వంటి హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ కూడా ఇషా చావ్లాకు సరైన అవకాశాలు రావట్లేదు. దాంతో వీరిద్దరూ కలిసి నటించడానికి ఇష్టపడట్లేదు. దాంతో ఈ అమ్మడిని మన అల్లరోడు సొంతం చేసుకున్నాడు. అల్లరి నరేష్ హీరోగా సత్తిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో నరేష్ సరసన హీరోయిన్ గా ఇషాను ఎంపిక చేశారు. ఇందులో నరేష్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.






