TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శోభా రాజీనామా,అనర్హత వేటు వేస్తే కోర్ట్ కు

Published on: Wed Dec 28, 2011 8:00AM

హైదరాబాద్: ఆళ్ళగడ్డ శాసనసభ సభ్యురాలు భూమా శోభానాగిరెడ్డి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.  స్పీకర్ నాదెండ్ల మనోహర్ అందుబాటులో లేకపోవడంతో రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శి సదారాంకు అందజేశారు. కాగా అంతకుముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ   రైతులు, రైతు కూలీల కోసం పదవుల త్యాగానికైనా సిద్ధమన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.ప్రజారాజ్యం పార్టీ ఓటు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అలాంటి పిఆర్పీ ఇచ్చిన విప్‌కు విలువ ఉండదన్నారు. జగన్ ఆలోచన మేరకు రైతులు, కూలిల కోసమే తాము ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. పిఆర్పీ ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటే తాను కోర్టుకు వెళతానని చెప్పారు.

తాను ఉప ఎన్నికల్లో వైయస్సార్సీ పార్టీ నుండి గెలవాలనుకుంటున్నానని, కనుమరుగైన పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగాలనుకోవడం లేదన్నారు. ఇప్పటికే కాంగ్రెసులో చేరిన వంగా గీతకు విప్ ఇచ్చే హక్కు లేదన్నారు. తనపై అనర్హత వేటు వేస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటానన్నారు. చిరంజీవి తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కాపు రామచంద్రా రెడ్డి వెనక్కి తగ్గలేదన్నారు. ఉప ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బహిర్గతమవుతుందన్నారు. ధైర్యం లేకే తాము చేసిన రాజీనామాలను ఆమోదించడం లేని విమర్శించారు. ప్రజావిశ్వాసం పొందేందుకే రాజీనామా అన్నారు. ఎవరు డ్రామాలు ఆడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు.