ఆళ్లకు ఏసీబీ నోటీసులు.. ఇప్పుడేమంటావ్ సామి...!

 

బినామీ ఆస్తుల కేసుల విచారణలో భాగంగా ఏపీ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీకి అది కామన్ ధింగే కదా అని అనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇంతకీ నోటీసులు పంపించింది ఎవరికి అనుకుంటున్నారా..? ఆయనెవరో కాదు.. తానో సత్య హరిశ్చంద్రుడిలా.. అసలు ఏ తప్పు చేయనివాడిలా మాట్లాడే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. బినామీ ఆస్తుల కేసులో విచారణలో హాజరు కావాలంటూ ఏపీ ఏసీబీ ఈయనకు నోటీసులు జారీ చేసింది. అసలు సంగతేంటంటే..

 

డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆస్తులపై తనిఖీలు జరిపిన ఏసీబీ పలు అక్రమాస్తులను వెలికి తీసిన సంగతి తెలిసిందే. గుంటూర, చీరాల, ఒంగోలు, హైదరాబాద్ సహా 14 చోట్ల తనిఖీలు చేసి.. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు కార్లు, బంగారం 3 కిలోల వెండి ఇంకా పలు అక్రమాస్తులు బయటకు తీశారు. అంతేకాదు.. ఈ తనిఖీల్లో పలు ఆసక్తికర విషయాలు కూడా బయటపడ్డాయి. ఆయన తిరిగే కారు ఆ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడి పేరుతో ఉంటే.. ఆయన బినామీ ఆస్తులు ప్రతిపక్ష ఎమ్మెల్యే భార్య పేరిట ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుర్గాప్రసాద్ కు చెందిన పలు ఆస్తులకు ఆళ్ల బినామీగా ఉన్నారని ఏసీబీకి సమాచారం ఉంది. దీంతో విచారణకు హాజరుకావాలని ఐపీసీ సెక్షన్ 160 కింద అళ్లకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మొత్తానికి ఇన్ని రోజులు నీతి కబుర్లు చెబుతూ.. జగన్ కు బినామీగా కోర్టుల్లో.. ట్రిబ్యునళ్లలో పిటీషన్లు వేసి ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్న ఆళ్ల ఇప్పుడు అవినీతి అధికారులకు కూడా బినామీ అని తేలిపోయింది. మరి ఇప్పుడు దీనిపై ఆళ్ల ఎలా స్పందిస్తాడో.. ఎలా కవర్ చేస్తాడో చూద్దాం...