TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిగ్ షాక్.. వైసీపీకి ఆళ్ళ నాని రాజీనామా!

Published on: Fri Aug 9, 2024 1:44PM

జగన్‌కి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకి చెందిన కీలక నాయకుడు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పార్టీకి రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్టు ఆళ్ళ నాని చెబుతున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించారు.