12,13న వేర్వేరుగా అఖిలపక్ష౦
Published on: Mon Nov 4, 2013 12:00PM

కేంద్ర ప్రభుత్వం విభజన అనంతర సమస్యలపై అఖిలపక్షం నిర్వహించడానికి గాను తేదీలను కూడా తాజాగా వెల్లడించింది. ఈ నెల 12, 13 తేదీలలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని పార్టీలు అఖిలపక్షంలో తమ తాజా అభిప్రాయాలు తెలపాలని, ఈ నెల 12న నాలుగు పార్టీలు, 13న మరో నాలుగు పార్టీలు తమ అభిప్రాయాలను తెలపాలని సూచించింది..అఖిలపక్షం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కు సమాధానం ఇవ్వడానికి కొన్ని పార్టీలు నిరాకరిస్తున్నందున వేర్వేరుగా పార్టీలతో సమావేశం జరపాలని కేంద్రం భావించిందని చెబుతున్నారు.


