వివాహాలు రిజిస్టర్ చేసుకోకపోతే వీసా రద్దు
Published on: Thu Jun 7, 2018 3:02PM

ఎన్నారైల పెళ్లిళ్లకి సంబంధించి ఈ మధ్యకాలంలో చాలా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే! అందుకనే దేశంలో జరిగే అన్ని ఎన్నారైలు పెళ్లిళ్లని 48గంటల్లోగా రిజిస్టరు చేసుకోవాలని శిశుసంక్షేమశాఖామంత్రి మేనకాగాంధీ ఆదేశించారు. లేకపోతే వారికి పాస్‌పోర్టు, వీసా జారీ చేయమని హెచ్చరించారు. ఇప్పటికే వివాహపు వివాదాలకు సంబంధించి ఐదుగురి పాస్‌పోర్టులను రద్దుచేశామని చెప్పుకొచ్చారు. అంతేకాదు! ఎన్నారై వివాహాలలో పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో వారి వివాహాలన్నీ తమ వెబ్సైటులో ఉంచుతామని చెప్పుకొచ్చారు. అబ్బో కఠినమైన చర్యలే తీసుకుంటున్నారన్నమాట.


