TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేపటి నుంచి ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాలి

Published on: Wed May 20, 2020 11:05AM

సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా గురువారం నుంచి తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న వారికి, గర్భవతులు, ఎక్కువ వయస్సుగల వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం మాత్రం కాస్త ఊరట ఇచ్చారు. పరిస్థితుల ఆధారంగా వారిని ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించనున్నారు. 

అలాగే ఉద్యోగులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలని ఉత్తర్వుల్లో సూచించారు. "కార్యాలయాల ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి, చేతులను శానిటైజ్‌ చేసిన తరువాతే లోపలికి పంపిస్తారు. అన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు శానిటైజ్‌ చేయాలి. ప్రతీ ఉద్యోగి విధిగా మాస్క్‌ ధరించి విధులకు హాజరు కావాలి. కార్యాలయాల్లో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. రెండు గంటలకోసారి సబ్బు, శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. భౌతిక సమావేశాలు తగ్గించి టెలి, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే సమావేశాలను నిర్వహించాలి. ఉద్యోగులు విధుల్లో ఉండగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే హోం క్వారంటైన్‌లో ఉండాలి. సంబంధిత అధికారులు సెలవును మంజూరు చేస్తారు." అని పేర్కొన్నారు.