TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావోయిస్టు అరెస్టు.. రిమాండ్...

Published on: Sun Sep 14, 2014 1:56PM

 

2003 సంవత్సరంలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరి సమీపంలో జరిగిన దాడితో సంబంధం ఉన్న మావోయిస్టు నాయకుడు దీపక్‌ అలియాస్ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతడిని కోల్‌కతాలో అదుపులోకి తీసుకుని చెన్నై మీదుగా నెల్లూరు తరలించారు. మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్థన్‌రెడ్డిపై దాడి కేసులో కూడా ఈయనే నిందితుడు. ప్రస్తుతం నేదురుమల్లి కేసు విషయంలోనే అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని, అతనికి రిమాండ్ విధించారని తెలుస్తోంది.