TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏలియన్స్… మనకు అనుమానం రాకుండా మన మధ్యే వున్నారట!

Published on: Thu Jun 1, 2017 2:41PM

ఏలియన్స్ అనే టాపిక్ మీద ఇండియన్స్ కి శ్రద్ధ కాస్త తక్కువే! గ్రహాంతర వాసులు వున్నారా? వుంటే ఎక్కడ వున్నారు? ఎలా వుంటారు? ఇటు వైపేమైనా వచ్చే అవకాశం వుందా?... ఇలాంటి కొశన్స్ మనం అసలు వేసుకోం! వేసుకునే కొద్ది మంది కూడా హాలీవుడ్ సినిమాల్లో చూపే ఏలియన్స్ కథలు చూసి… అదే నిజమనుకుంటూ వుంటారు! కాని, ఫ్యాక్ట్ ఏంటంటే.. ఇప్పటి వరకూ సైంటిస్టులు అధికారికంగా గ్రహాంతర వాసులు వున్నారని ప్రకటించలేదు!

 

విశ్వాన్ని, అంతరిక్షాన్ని అధ్యయనం చేసే నాసా, ఇస్రో సైంటిస్టులు ఇప్పటి దాకా ఏలియన్స్ గురించి అఫీషియల్ గా ఏం చెప్పకపోయినా… ఒక్కాయన మాత్రం నోరు విప్పారు! గ్రహాంతర వాసులు వున్నారనీ… వారిలో కొందరు మన మధ్యే వున్నారని కూడా ఆయన అంటున్నాడు! అసలు మన నడుమనే ఏలియన్స్ వున్నా మనకు ఆ విషయం తెలియటం లేదని సదరు మేదావి చెప్పుకొచ్చారు! ఆయనే… రాబర్ట్ బిగ్లో!

 

రాబర్ట్ నాసా వారితో కలిసి అంతరిక్ష వ్యాపారం చేస్తోన్న ఒక బిజినెస్ మ్యాన్! ఆయన కంపెనీ అంతరిక్షంలో చెక్కుచెదరని నిర్మాణలు ఎలా చేయాలన్న అంశంపై నాసాతో కలిసి పని చేస్తోంది! రాబర్ట్ కంపెనీ రెడీ చేస్తోన్న నమూనాలు ఓకే అయితే… అంతరిక్షంలో రేపు అవ్వే హోటల్స్ , ల్యాబ్ లు, ఫ్యాక్టరీలుగా మారతాయి! అందుకే, ఆయనకి అంతరిక్ష పరిశోధనలు, గ్రహాంతర వాసుల గురించి అధ్యయనం చేసే నాసా బృందాలతో దగ్గరి సంబంధాలు వున్నాయి!

 

రాబర్ట్ ను ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో అడుగగా, ఆయన ఏలియన్స్ ఖచ్చితంగా వున్నారని స్పందించాడు! అంతే కాదు, మన మధ్యే ఏలియన్స్ సాదాసీదా కలిసిపోయారని ఆయన చెప్పాడు. వార్ని గుర్తించటం చాలా కష్టమన్నాడు. అయితే, ఆయన తనకు అలాంటి నమ్మకం కలగటానికి కారణమైన అంశాల్ని మాత్రం చెప్పలేదు. అలాగే మన మధ్యే ఏలియన్స్ వున్నారన్న తన కామెంట్ కి సపోర్ట్ గా ఎలాంటి ప్రూఫ్స్ చూపలేదు! ఇక నమ్మలా వద్దా అన్నది మన ఇష్టం!