TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అక్కినేని నాగార్జున అవయవదానం

Published on: Sun Sep 14, 2014 10:10PM

 

అక్కినేని నాగార్జున అవయవదాన డిక్లరేషన్ మీద సంతకం చేశారు. యశోదా హాస్పిటల్ హైదరాబాదులో నిర్వహించిన ‘ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్’లో పాల్గొన్న నాగార్జున అవయవదానం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 4300 మంది అవయవదానానికి అంగీకరించి, డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఈ డ్రైవ్‌కు హాజరైన వారితో నాగార్జున ప్రతిజ్ఞ చేయించారు. యశోదా ఆసుపత్రి యాజమాన్యం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని నాగార్జున అన్నారు. అప్పట్లో తన తండ్రి నాగేశ్వరరావు కూడా అవయవదానానికి ముందుకొచ్చినా, డాక్టర్లు సాధ్యంకాదని చెప్పారని తెలిపారు. ఆయనకు సోకిన వ్యాధి కారణంగా అవయవదానం వీలుకాదన్నారని నాగ్ వివరించారు. నాగార్జునతోపాటు పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి సోనియా, షట్లర్ పీవీ సింధు కూడా అవయవదాన డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు.