TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

త్రివిక్రమ్ తో చేయట్లేదంటున్న అఖిల్

Published on: Wed Nov 6, 2013 10:30AM

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ సినీరంగ ప్రవేశం చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు అఖిల్ తెరదించాడు. తన సినిమాల గురించి తానే ఎప్పటికప్పుడు తెలియజేస్తానని అన్న అఖిల్ తన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. "నా సినిమా ఎంట్రీ గురించి వస్తున్న వార్తలేమి నిజం కాదు. త్రివిక్రమ్ గారితో సినిమా చేయడం నాకు ఇష్టమే. కానీ నేనింకా ఏ కథలు వినలేదు.ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు" అని అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.