అఖిలేష్ యాదవ్ అంత పని చేశాడా..!!

 

యూపీ మాజీ సీఎంలు ప్రభుత్వ నివాసాలు ఖాళీ చేయాలంటూ సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇవ్వడం, అయిష్టంగానే వారు ఖాళీ చేయడం తెలిసిందే.. అయితే మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన పనికి అధికారులు కంగుతిన్నారట.. అఖిలేష్ ఇంటిని ఖాళీ చేసి వెళ్తూ.. ప్రభుత్వ ఖర్చుతో తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఏసీలు, తలుపులు, మార్బుల్స్ తీస్కెళ్ళాడట.. దీనితో అధికారులు, అఖిలేష్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.. అయితే అఖిలేష్ మాత్రం 'నేనేం తీసుకెళ్లలేదు.. నేను పెంచుకున్న మొక్కలు కూడా అక్కడే వదిలేసి వచ్చాను.. బీజేపీ కావాలనే నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది' అంటూ తన మీద వస్తున్న వార్తలని ఖండించారు.. అసలు నిజం బయటికొస్తే కాని తెలీదు.. ఇది అఖిలేష్ మాయో? బీజేపీ మాయో?.