ఓటమిని మరచి.. హోలీ ఆడిన అఖిలేశ్...
Published on: Mon Mar 13, 2017 3:12PM

యూపీ ఎన్నికల్లలో సమాజ్ వాదీ పార్టీ ఘోర పరాజయం మూట గట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమిని సైతం లెక్క చేయకుండా అఖిలేశ్ యాదవ్ ఈరోజు హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తన సొంత జిల్లా అయిన ఇటావాలో జరిగిన హోలీ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపి సరదాగా ఆయన కూడా హోలీ ఆడారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా యూపీ ఎన్నికల్లో ఎస్పీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ మేజిక్ ఫిగర్ ను సైతం దాటి 325 స్థానాలు గెలుపొంది అధికారం చేజిక్కించుకుంది. ఇక ఎస్పీ 54 స్థానాలు మాత్రమే దక్కించుకుంది.


