మే ఒంటరిగానే పోటీ చేస్తున్నాం.. కాంగ్రెస్
Published on: Sat Dec 5, 2015 3:10PM

ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ఢిల్లీలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ సదస్సులో చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ పొత్తు గురించి అఖిలేష్ యాదవ్ ను విలేకరులు ప్రశ్న అడిగారు. దీనికి అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ ను కనుక ప్రధాన మంత్రి చేస్తానంటే పొత్తుకు అంగీకరిస్తామని సమాధానం చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ స్పందించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని.. ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని అన్నారు. అంతేకాదు అసలు 2017 లో జరిగేది లోక్ సభ ఎన్నికలు కాదు.. అసెంబ్లీ ఎన్నికలు అని వారు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.


