TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అతడు కూడా మనంలో దూకేసాడు

Published on: Mon Nov 18, 2013 4:10PM

 

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం "మనం". ఈ సినిమా గురించి నాగ్ ఓసారి మాట్లాడుతూ.."ఈ చిత్రంలో అఖిల్ ఎంట్రీ లేదు. అఖిల్ కోసం కథలో ఎలాంటి మార్పు చేయట్లేదు" అని చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం "మనం"లో అఖిల్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈరోజు అక్కినేని ఫ్యామిలీ అందరిపై ఓ సన్నివేశాన్ని తెరకెక్కించారు.నాగార్జున సరసన శ్రియ, చైతన్య సరసన సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.