అక్బరుద్దీన్‌కు నిర్మల్ కోర్టులో చుక్కెదురు
Published on: Wed Jan 9, 2013 5:43PM

ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌కు నిర్మల్ మున్సిఫ్ కోర్టులో చుక్కెదురైంది. ఆరోగ్యం సరిగా లేనందున తనను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు లేదా వరంగల్ జైలుకు తరలించాలని అక్బర్ తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అదిలాబాద్ జిల్లా కేంద్రం జైలులోనే ఉంచి, రిమ్స్‌లో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోర్టు అదేశించింది. వైద్య చికిత్సల నిమిత్తం అక్బరుద్దీన్‌ను ఈ సాయంత్రం 6 గంటలకు రిమ్స్‌కు తరలించనున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని బుధవారం ఉదయం పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. ఆయనకు ఖైదీ నెం 7546ను కేటాయించారు. ఈ తెల్లవారుజామున అక్బరుద్దీన్‌ను మెజీస్ట్రేట్ ముందు హాజరుపర్చగా, కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది.


