ఎంఐఎం అక్బరుద్దీన్ కి 14 రోజుల రిమాండ్
Published on: Wed Jan 9, 2013 3:01PM
.jpg)
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిర్మల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ అజేష్‌కుమార్ ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి అక్బరుద్దీన్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం భారీ భద్రత మధ్య ఎమ్మెల్యేను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. తాను అనారోగ్యంతో ఉన్నానని ప్రత్యేక ఖైదీగా పరిగణించి చంచల్‌గూడ లేదా వైద్య సదుపాయాలు ఉన్న జైలుకు పంపాలని అక్బరుద్దీన్ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రంతా అక్బరుద్దీన్ నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు.


