TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బారామతి విమాన ప్రమాదానికి కారణమిదే : రామ్మోహన్ నాయుడు

Published on: Wed Jan 28, 2026 2:58PM

 

మహారాష్ట్ర విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. వెలుతురు సమస్యే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ల్యాండింగ్ సమయంలో సరైన వెలుతురు లేదని ఆయన తెలిపారు. రన్‌వే స్పష్టంగా కనిపిస్తున్నదా? లేదాని బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు పైలట్లను అడగగా, కనిపించడం లేదని వారు సమాధానం ఇచ్చారని మంత్రి వివరించారు. 

దీంతో విమానం కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టిందని చెప్పారు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించిన సమయంలో మళ్లీ రన్‌వే కనిపిస్తున్నదా అని ఏటీసీ ప్రశ్నించగా, ఈసారి పైలట్లు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. దాంతో ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చామని, ఆ వెంటనే విమానం ప్రమాదానికి గురైందన్నారు.ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు. అధికారులతో కలిసి కేంద్ర మంత్రి ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు.