TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుజరాత్‌ సక్సెస్ కు సెల్యూట్ : ఐశ్వర్యారాయ్

Published on: Mon Dec 10, 2012 10:12AM

 

Aishwarya Rai lauds Gujarat, Gujarat Aishwarya Rai, Aishwarya Rai Bachchan gujarati news

 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఆరోపణలు, ప్రత్యారోపణల్లో తలమునకలుగా ఉన్న ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అనుకోని విధంగా అరుదైన ప్రశంసలు జల్లు కురిసింది. ఆయన సర్కారును బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ పేరును ప్రస్తావించకుండా ఆయన ప్రభుత్వ పనితీరును తెగ మెచ్చుకున్నారు. ‘గుజరాత్ విజయగాథకు సెల్యూట్ చేస్తున్నా. ఆ గాథ నాకు బాగా తెలుసు. గుజరాత్‌లో ఉంటే నా ఇంట్లో ఉన్నట్లే ఉంది. ఈ రాష్ట్రం రోజురోజుకూ బలోపేతమవుతోంది’ అని ఆమె ఆదివారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. ఐశ్వర్య మామ, నటుడు అమితాబ్ బచ్చన్ గుజరాత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండడం తెలిసిందే.