అమ్మకానికి ఎయిర్‌ ఇండియా! కానీ కొనేదెవరు

posted on: Jun 1, 2018 11:45AM

 

ఓ పాతికవేల కోట్లు పెట్టి ఎయిర్‌ ఇండియాలో 76 శాతం హక్కులను సొంతం చేసుకోవచ్చంటూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుని ఎవరూ పట్టించుకోనేలేదు. నిన్న సాయంత్రంతో ముగిసిన గడువులోగా ఒక్కరంటే ఒక్కరు కూడా ఎయిర్ ఇండియాని సొంతం చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఇప్పటికే 48 వేల కోట్ల నష్టాలతో నడుస్తున్న ఎయిర్‌ ఇండియా భారాన్ని మోసేందుకు ఎవరూ సాహసించలేదు. ఎయిర్‌ ఇండియా ఓ గడ్డు పరిశ్రమ అనీ, అక్కడ యాజమాన్యం కానీ ఉద్యోగులు కూడా సవ్యంగా ఉండదనీ ఓ ఆరోపణ వినిపిస్తుంది. దాని వల్లే నష్టాలు వస్తున్నాయన్న విశ్లేషణా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంస్థ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే!

google-ad-img
    Related Sigment News
    • Loading...