TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూలిన అల్జీరియా విమానం.. అదో ముసలి విమానం!!

Published on: Fri Jul 25, 2014 11:59AM

 

అల్జీరియాకు చెందిన ఒక పౌరవిమానం గురువారంనాడు బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వస్తుండగా కూలిపోయింది. ఈ విమానంలో 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ విమానం సహారా ఎడారి ప్రాంతంలో కూలి వుండొచ్చని భావిస్తున్నారు. కాగా, కుప్పకూలిపోయిన విమానం చాలా పాతబడిపోయిన విమానం అని తెలుస్తోంది. గత పదకొండు సంవత్సరాలుగా ఈ విమానం పనిచేస్తూనే వుంది. చాలా పాతబడిపోయిన ఈ విమానం వాతవరణంలోని పీడనాన్ని తట్టుకోలేక కూలిపోయి వుండొచ్చని తెలుస్తోంది.