TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణించింది

Published on: Thu Aug 16, 2018 11:14AM

 

మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల, మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి, కొద్దీ రోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.. 'దురదృష్టవశాత్తూ వాజ్‌పేయీ ఆరోగ్యం క్షీణించింది.. ఆయన క్లిష్ట పరిస్థితిల్లో ఉన్నారు’ అంటూ తాజాగా ఎయిమ్స్‌ నుంచి బులెటిన్‌ విడుదలైంది.. గత 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టు తెలుస్తోంది.. మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వని కుమార్ చౌబే మాట్లాడుతూ.. వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ప్రత్యేక వైద్యబృందం వాజ్‌పేయికు చికిత్స అందిస్తున్నట్టు తెలిపిన ఆయన, ఇకపై దేవుడి దయ అని పేర్కొన్నారు.. ఇప్పటికే బీజేపీ పార్టీ అధికార కార్యక్రమాలను రద్దు చేసుకోగా.. ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అమిత్ షా లాంటి ప్రముఖులు ఎయిమ్స్ కి వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు.