బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కష్టపడుతున్న కాంగ్రెస్

 

మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా ఏఐసీసీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యనేతల సూచనలు తీసుకున్న ఏఐసీసీ వాటి ఆధారంగా కార్యక్రమాలు రూపొందించబోతుంది. ఇప్పటికే బీజేపీ ఆర్ధిక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. అయితే రాఫేల్ డీల్ పై కేంద్రానికి సుప్రీం క్లీన్ చిట్ ఇవ్వడంతో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఏఐసీసీ నిర్ణయం తీసుకోబోతుంది. డిసెంబర్ లో ఢిల్లీ రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. 

గత 20 రోజులుగా అనారోగ్యంతో బెంగుళూరులోని జిందాల్ ప్రకృతి నిలయంలో చికిత్స పొందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఏఐసీసీ సెక్రటరీలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్ చార్జిలు.. భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. డిల్లీలోని వార్ రూమ్ లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతల సమావేశం కొనసాగుతుంది. కాసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తాత్కాలిక కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనీయా గాందీ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. అన్నీ రాష్ట్రాల నుంచి కీలక నేతలంరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలనే ప్రధాన ఎజెండాతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఎన్ని చేసినా ప్రజల్లో ఒక్కసారి పోయిన నమ్మకం అంత సులువుగా తిరిగి రాదని.. బీజేపీ చేస్తున్న మంచి పనులను ప్రజలు చూస్తూనే ఉన్నారని.. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు.