పన్నీర్ సెల్వానికి స్తంభాలు... శశికళకు ఆటో...
Published on: Thu Mar 23, 2017 11:52AM

పార్టీ గుర్తు మాకంటే.. మాకు అని గొడవ పడిన పన్నీర్ వర్గానికి.. శశికళ వర్గానికి ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్నికల గుర్తు ఎవరకీ ఇచ్చేది లేదని తాత్కాలికంగా నిషేదించింది. దీంతో ఆర్కే నగర్ ఎన్నికల్లో ఇరు వర్గాలకు ఈసీనే గుర్తులు కేటాయించింది. పన్నీర్ సెల్వం వర్గం తమ పార్టీని ‘అన్నాడీఎంకే పురుచ్చి తలైవి అమ్మా’గా ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదించగా.. శశికళ వర్గం ‘అన్నాడీఎంకే అమ్మా’గా ప్రతిపాదించింది. దీంతో ఈసీ పన్నీర్‌సెల్వం వర్గానికి రెండు స్తంభాల గుర్తును కేటాయించగా.. శశికళ వర్గానికి ఆటో గుర్తు కేటాయించింది.


