TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

సెల్వం, శశికళ వర్గానికి షాక్... పార్టీ గుర్తు ఎవరికీ ఇవ్వలేం..

Published on: Thu Mar 23, 2017 10:43AM

 

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆర్క నగర్ నియోజక వర్గ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఖాళీ అయిన ఈ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగబోతుంది. ఈనేపథ్యంలోనే  ఈ స్థానానికి గట్టి పోటీనే ఏర్పడింది. ఒకపక్క పన్నీర్ సెల్వం వర్గం... మరోవైపు శశికళ వర్గం.. ఇంకా జయ మేనకోడలు అయిన దీపా జయకుమార్ బరిలోకి దిగనుండటంతో పోరు గట్టిగానే ఉంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడే అసలు సమస్య ఏర్పడింది. పార్టీ గుర్తుపై కూడా రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి.  ఈ గుర్తు తమకు చెందాలంటే, తమకే చెందాలంటూ పట్టుబడుతున్నాయి. దీనిలోభాగంగానే ఇప్పుడు పార్టీ గుర్తుపై ఎలక్షన్ కమిషన్ రెండు వర్గాలకి షాకిస్తూ నిర్ణయాన్ని తెలిపింది. పార్టీ గుర్తు తమకు చెందాలని.. రెండు వర్గాలు ఎలక్షన్ కమిషన్ కు నివేదికను అందించాయి. అయితే ఈ నివేదికపై స్పందించిన ఎలక్షన్ కమిషన్.. ఇరు వర్గాలు 20 వేల పేజీలకు పైగా నివేదికలను అందించాయి.. అయితే కేవలం ఒక్క రోజు ముందు ఇచ్చాయని, ఏ మానవ మాత్రుడికీ, వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం, నిర్ణయం తీసుకోవడం అంత సులువయ్యే పని కాదని పేర్కొంది. దీంతో రెండాకుల గుర్తును ఎవరికీ ఇవ్వలేమని, ఈ విషయమై పార్టీ గుర్తును తాత్కాలికంగా నిషేధిస్తున్నామని చెప్పింది.