TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మధుసూదన్ కు బెదిరింపులు...తప్పుకోకుంటే చంపేస్తాం..

Published on: Wed Mar 22, 2017 10:35AM

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆర్కే నగర్ నియోజకవర్గ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానానికి గాను త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ స్థానం నుండి పోటీ కూడా గట్టిగానే ఉంది. ఉన్న ఒక్క స్థానానికి పన్నీర్ సెల్వం వర్గం నుండి మధుసూదన్, శశికళ వర్గం నుండి దినకరన్... మరోవైపు జయ మేనకోడలు దీపా జయకుమార్ కూడా బరిలో ఉన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్న ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఆర్కేనగర్ స్థానం నుంచి బరిలోకి దిగిన మధుసూదనన్‌కు బెదిరింపులు వస్తున్నాయట. ఆర్కేనగర్ నుంచి తప్పుకోవాలని, లేదంటే చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. దీంతో ఆయన డీజీపీకి ఫిర్యాదు చేసి... తనకు తగిన భద్రత కల్పించాలని కోరారట. కాగా ఇంతకుముందు దీపా జయకుమార్ కు కూడా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్కే నగర్ ఎన్నికల బరిలోనుండి తప్పుకోవాలని.. లేకపోతే చంపేస్తామని ఆమెను కూడా బెదిరించిన విషయం తెలిసిందే.