బయటపడిన అన్నాడీఎంకే నిజస్వరూపం..


 

పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ.. నన్ను ఎవరూ చూడట్లేదులే అని ఫీల్ అవుతుందట.. అల అన్నాడీఎంకే అసలు నిజస్వరూపం బయటపడింది. కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న అన్నాడీఎంకే అసలు ఉద్దేశం తెలిసిపోయింది. ఒకపక్క ఏపీ రాష్ట్ర ప్రజలు తమకు అన్యాయం జరిగింది.. మాకు కాస్త న్యాయం చేయండిరా బాబు అంటూ ధర్నాలు, రాస్తా రోకోలు, దీక్షలు అంటూ రోడెక్కుతున్నారు. ఇక టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వంపై యుద్దానికి దిగారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పార్లమెంట్ కు కదిలికి వెళ్లారు. అయినా పాడిందే పాటరా అన్నట్టు.. సభ వాయిదాలు పడుతూ.. అవిశ్వాస తీర్మానం మాత్రం చర్చకు రావడం లేదు. దీనికి కారణం అన్నాడీఎంకే నేతల ఆందోళనలు. మొన్నటి వరకూ టీఆరఎస్ కూడా వారి బాటలోనే నడిచినా.. తరువాత మనసు మార్చుకొని ఏపీకి మద్దతుగా నిలుస్తామని చెప్పింది. కానీ అన్నాడీఎంకే మాత్రం తమ ధోరణిని వదలకుండా అలానే ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక స్పీకర్ గారికి ఇదే సాకు దొరికింది. ఇంతమంది అడ్డుగా ఉంటే చర్చ జరపడం కుదరదు అని.. సభను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ అవిశ్వాస తీర్మానంపై చర్చ మాత్రం జరగుకుండా చేస్తున్నారు.

 

మరి ఇప్పుడు వెల్ లో ఉండి కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న అన్నాడీఎంకే నేతల రాజకీయ డ్రామాలు బయటపడ్డాయి. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం చర్చకు రాకుండా, తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్టు ఆ పార్టీ ఎంపీలు చేస్తున్నదంతా డ్రామానే అనే విషయం వెలుగు చూసింది. తమిళ రాష్ట్ర ప్రయోజనాల కోసం కావేరీ బోర్డును ఏర్పాటు చేయాల్సిందే అనే డిమాండ్ తో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు సైతం నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే పైకి మాత్రమే నిరాహార దీక్ష అని కలరింగ్ ఇచ్చి.. దీక్ష మధ్యలో పక్కకు వచ్చి, కడుపునిండా భోజనాలు లాగిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో అసలు నిజం బయటపడింది. దీంతో ఇప్పుడు ఈ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు పనిలో పనిగా పలువురు వ్యక్తులు మందు కూడా కొట్టేశారు. దీంకో ఢిల్లీలో అన్నాడీఎంకే నేతలు చేస్తున్నదంతా పొలిటికల్ డ్రామానే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తానికి అన్నాడీఎంకే వెనుక బీజేపీ ఉంది.. బీజేపీనే ఇదంతా చేయిస్తుంది అన్న రూమర్లను ఇప్పుడు నిజంగానే నిజం చేశారు అన్నాడీఎంకే నేతలు. మాకు తాగటానికి నీళ్లు లేవు అంటే వెంటనే నీటిని ఇచ్చినా.. ఆ కృతజ్ఞత కూడా లేకుండా.. మాకు కాస్త సహకరించడయ్యా బాబు అంటే పక్క రాష్ట్రాలతో మాకు పనేంటి అని విర్రవీగిన నేతలు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారో.. తాము చేసే డ్రామాలకు ఎలా కవరింగ్ ఇస్తారో చూద్దాం..