త్వరలో మళ్లీ ఎన్నికలు..అధికారం మనదే: స్టాలిన్
Published on: Wed Mar 1, 2017 10:22AM
.jpg)
తమిళనాడు రాజకీయాలు రోజుకోక మలుపు తిరుగుతున్నాయి. నిన్న కొత్త సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ వర్గాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. కాగా ఏఐఏడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని అధికారం చేపట్టేందుకు ప్రతిపక్ష డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని..ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్షనేత స్టాలిన్. పార్టీ జిల్లాల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో స్టాలిన్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు, పార్టీ కేడర్ మొత్తం సిద్ధంగా ఉండాలని..కొంచెం కష్టపడితే అధికారం మనదేనన్నారు.


