మోడి సర్కార్‌కు హైకోర్టు చీవాట్లు
Published on: Thu Feb 9, 2012 8:36AM
అహ్మదా
బాద్: గుజరాత్‌లో గోద్రా ఘటన అనంతరం సాగిన హిందూ మతోన్మాద మారణకాండపై క్రియా రాహిత్యంగా, తీవ్ర నిర్లక్ష్యంగా వహించడంపై నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, అల్లర్ల సమయంలో గుజరాత్ ప్రభుత్వం తగిన విధంగా స్పందించకుండా చర్యలు తీసుకోకపోవడంతోనే అరాచక పరిస్థితి రోజుల పాటు కొనసాగిందని బుధవారం గుజరాత్ హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ మతపరమైన దాడుల్లో ధ్వంసమైన 500 మత సంబంధిత నిర్మాణాలకు నష్టపరిహారం చెల్లించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి భాస్కర్ భట్టాచార్య, న్యాయమూర్తి జెబి పర్దివాలా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐఆర్‌సిజి పిటిషన్‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇది రాజ్యాంగంలోని 27వ ఆర్టికల్‌ను ఉల్ల ఘించడమేని పేర్కొంది. మత సంబంధిత నిర్మాణాలు ధ్వంసమైతే వాటికి మరమ్మత్తులు చేయించేందుకుగానీ, నష్టపరిహారం చెల్లించేందుకుగానీ విధానమేదీ లేదని ప్రభుత్వం సాకులు చెప్పుకొచ్చింది. అయితే సర్కారు వాదనను కోర్టు తోసిపుచ్చింది. దాడుల్లో ధ్వంస మైన ఇళ్లకు, వాణిజ్య సంస్థలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించినప్పుడు మత సంబంధిత నిర్మాణాలకు కూడా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. గోధ్రా అనంతర అల్లర్లలో కనీసం 1200మంది మరణించగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విధ్వంసం చెలరేగింది. కోర్టు తీర్పును ఐఆర్‌సిజి న్యాయవాది ఎంటిఎం హకీం 'విశిష్టమైన తీర్పు'గా ప్రశంసించారు. 2002 హిందూ మతోన్మాద శక్తుల దాడి సమయంలో నిర్లక్ష్యం, క్రియారాహిత్యాన్ని ప్రభుత్వాన్ని బాధ్యతగా చేస్తూ ఇచ్చిన తొలి తీర్పు కూడా ఇదేనని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు నుంచి చివరి కోర్టు వరకు అల్లర్లు, బూటకపు ఎన్‌కౌంటర్లకు సంబంధించి మోడీని దోషిగానే నిలిపాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బికె హరిప్రసాద్ అన్నారు.


