అగ్రిగోల్డ్ చైర్మన్, ఎండీకి 14రోజుల రిమాండ్..

హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ సీతాపతి నేతృత్వంలో కొత్త కమిటీ ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలపై విధివిధానాల రూపకల్పన.. అగ్రిగోల్డ్ ఎండీ, ఛైర్మన్ అరెస్ట్ పై ఈ కమిటీ చర్చించనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ఆస్తుల విలువ వివరాలను కోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకటరామారావు, ఎండీ శేషునారాయణలను సీఐడీ అధికారులు ఏలూరు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈనేపథ్యంలో వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి తరలించి.. అనంతరం జైలుకు తరలించనున్నారు.