అగ్ని వి ప్రయోగం విజ‌య‌వంతం

 

భార‌త అమ్ముల పొదిలో మ‌రో అస్త్రంలో స‌గ‌ర్వంగా చేరింది. పూర్తిస్వదేశి ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన అగ్నివి క్షిప‌ణిని రెండోసారి కూడా విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది డిఆర్‌డిఓ. ఒడిశా కోస్తా తీరంలోని వీల‌ర్ ద్వీపంలోని లాంయ్‌ప్యాడ్ 4 నుంచి డిఫెన్స్ రీస‌ర్చ్ అండ్ డెవ‌లెప్‌మెంట్ ఆర్గనైజేష‌న్ దీన్ని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది.

ఆదివారం ఉద‌యం ఎనిమిది గంట‌ల యాబై నిమిషాల‌కు అగ్ని వి ను ప్రయోగించారు. దాదాపు 5000 కిలోమీట‌ర్లకు పైగా దూరంలో ఉన్న ల‌క్షాల్యను కూడా అగ్ని వి గురిత‌ప్పకుండా చేదించ‌గ‌ల‌దు. దాదాపు 50 ట‌న్నుల బ‌రువు, 17 మీట‌ర్ల పొడ‌వు ఉన్న అగ్ని వి ఒక ట‌న్ను బ‌రువైన అణ్వస్త్రాల‌ను ల‌క్ష్యం వైపు మోసుకుపోగ‌ల‌దు.

గ‌త ఏడాది ఏప్రిల్ 2న కూడా అగ్ని వి క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు. ఈ ప్రయోగంతో ఖండాత‌ర క్షిప‌ణి ర‌క్షణ వ్యవ‌స్థ ఉన్న అతి కొద్ది దేశాల స‌ర‌స‌న భార‌త్ చేరింది. భార‌త ర‌క్షణ వ్యవ‌స్థలో అగ్ని ఓ కీల‌క ఆయుదంగా మార‌నుంది.