TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతి చేరుకున్న  ముఖ్యమంత్రి చంద్రబాబు

Published on: Thu Jan 9, 2025 12:20PM

తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు  సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నేరుగా ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ్నుంచి  తిరుపతి రిమ్స్, రుమా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. 38 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ సాయంత్రం   క్షతగాత్రులను పరామర్శించనున్నట్లు సమాచారం.