అప్ఘనిస్థాన్లో బాంబు పేలుడు.. ఈజిప్టులో కూడా..
Published on: Mon Feb 1, 2016 2:53PM

ఈ ఒక్కరోజే పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో పార్లమెంటు భవనం సమీపంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు ఈజిప్టులో రెండు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈజిప్టులోని రఫా ప్రాంతంలో భద్రతా సిబ్బంది పోలీసు వాహనంలో వెళుతుండగా బాంబు పేలుడు సంభవించింది. ఈఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు. మరో ప్రాంతం ఉత్తర సినాయ్ లో కూడా బాంబు పేలుడు సంభవించింది. షేక్ జువాయిడ్ పట్టణంలో సైనికాధికారులపై దుండగులు బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికాధికారులు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యాయి.


