చంద్రబాబు మేలు మరువలేను: ఎల్.కె.అద్వానీ
Published on: Sun Jun 8, 2014 8:27PM
.jpg)
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎల్.కె.అద్వానీ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు. కేంద్రం మద్దతు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంపూర్ణంగా వుంటుందని భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వాని అన్నారు. ఆయన ఈ సందర్భంగా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఢిల్లీలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా వున్నప్పుడు ఎన్టీయే కన్వీనర్‌గా చంద్రబాబు చేసిన మేలు మరచిపోలేమని అద్వానీ అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఇంతమంది ముఖ్యమంత్రులు రావడం చాలా గొప్ప విషయమని అద్వానీ అన్నారు.


